తెలంగాణలో కోటి ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట శివారులో 19 కోట్ల వ్యయంతో 1550 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే తలమానికమని కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. రైతాంగానికి సాగు నీటిని అందించేందుకు 90కోట్లతో గోదావరి నదిపై 11 ఎత్తిపోతల పథకాలను నిర్మించామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే తలమానికం - minister
జగిత్యాల జిల్లా దమ్మన్నపేటలో 1550 ఎకరాలకు సాగు నీరందించే ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే తలమానికమని ఆయన అన్నారు.
కొప్పుల ఈశ్వర్