ETV Bharat / state
'ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. మీవెంటే ఉంటాం' - ప్రచారం
రాష్ట్రంలో తెరాస కారు గేరు మార్చి... ప్రచారజోరును పెంచింది. వరుసగా కేసీఆర్, కేటీఆర్ సభలు, రోడ్‌షోలతో దూసుకెళ్తుంటే... మరోవైపు కవిత ప్రచారసభలతో హోరెత్తిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎన్నికల ప్రచారానికి హాజరై ఓటర్లను తన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు.
జగిత్యాలలో కవిత ఎన్నికల ప్రచారం
By
Published : Apr 3, 2019, 1:51 PM IST
| Updated : Apr 3, 2019, 2:55 PM IST
జగిత్యాలలో కవిత ఎన్నికల ప్రచారం భాజపా, కాంగ్రెస్‌లను పారద్రోలే వరకు రాష్ట్రం అభివృద్ధి చెందదని కవిత జగిత్యాల కోరుట్ల ప్రచార సభలో పేర్కొన్నారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలోనే మిగతా పార్టీలు ప్రజల వద్దకు వస్తాయని... ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో కలిసి ఉండే పార్టీ తెరాస అని తెలిపారు. భవిష్యత్తులో ఇల్లు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండకూడదని.. అందరికి ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. తాను మీ ఆశీర్వాదం వల్ల ఎలాగైనా విజయం సాధిస్తానని... మిగతా ఎంపీలను కూడా గెలిపించాలని కవిత ఓటర్లను కోరారు.
Last Updated : Apr 3, 2019, 2:55 PM IST