జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనారసింహుని ఆలయం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. మహిళలు గోదావరి నదిలో స్నానమాచరించి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని కార్తిక దీపాలను వదిలారు. వెల్గటూరు మండలంలోని కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులతో పోటెత్తిన ధర్మపురి నారసింహుని ఆలయం - karthika pournami celebrations
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
భక్తులతో పోటెత్తిన నారసింహుని ఆలయం