జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన కనకసోమేశ్వర స్వామిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ఈ దివ్యక్షేత్రానికి సుమారు 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. చుట్టూ పచ్చని పొలాల మధ్య ఉన్న కొండపై స్వామి వారు కొలువుతీరారు. ఈ కొండకు ఓ ప్రత్యేకత ఉంది. ఎత్తైన కొండల మధ్య ఉన్న కోనేరు... ఏడాదంతా నిండుగా నీటితో ఉంటుంది. ఈ కోనేటిలో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
సోమేశ్వర ఆలయం... ఒక్కసారైనా దర్శించుకుంటే మహాభాగ్యం - మహాశివరాత్రి 2021
చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తయిన కొండలు... దానిమీద కొలువుదీరిన సోమేశ్వరస్వామి. ఏటా నిర్వహించే మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతాయి. స్వామి భక్తులకు కొంగుబంగారమై కనువిందు చేస్తారు. అదే మల్లాపూర్ మండలంలో కొలువైన సోమేశ్వరస్వామి పుణ్యక్షేత్రం.
సోమేశ్వర ఆలయం... ఒక్కసారైనా దర్శించుకుంటే మహాభాగ్యం
ప్రతి సోమవారం స్వామివారికి అర్చకులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి సోమేశ్వరుని భక్తితో కొలుస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని... భక్తులు పెద్ద ఎత్తున సోమేశ్వర దీక్షలు స్వీకరిస్తుంటారు. ఇంతటి విశిష్టమైన కొండను దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో హాజరవుతుంటారు.
ఇదీ చూడండి:పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?