Pawan Kalyan Kondagattu tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు. పవన్ కల్యాణ్ తన ప్రచార రథం ‘వారాహి’కి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించనున్నారు. వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.
Pawan Kalyan: కొండగట్టుకు చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ కొండగట్టు టూర్ న్యూస్
Pawan Kalyan Kondagattu tour : వారాహి యాత్ర ప్రారంభించేముందు ఆ వాహనానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేయించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లారు. జనసైనికులు భారీ కాన్వాయ్‌తో రాగా పవన్ అంజన్న సన్నిధికి చేరుకున్నారు. కాసేపట్లో జనసేనాని ప్రచార రథం వారాహికి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించనున్నారు.
అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేనాని సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు.
ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.