జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, మెట్పల్లి మండలాల్లో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చేతికొచ్చిన మామిడి కాయలు నేలారాలాయి.
అకాల వర్షం.. రైతన్నల జీవితం అతలాకుతలం - crop loss due to rain in jagtial
అకాల వర్షం జగిత్యాల జిల్లా కర్షకులకు కన్నీరు మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చేతికొచ్చి మామిడి పంట నేలరాలింది. కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం నీటిపాలయింది.
జగిత్యాల జిల్లాలో అకాల వర్షం
ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసిముద్దయింది. చాలా చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మాదాపూర్ శివారులోని రైస్ మిల్లులో రేకులు గాలికి ఎగిరిపోయాయి. అకాల వర్షం తమ జీవితాలను అతలాకుతలం చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.