జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్... మరో కళా ఖండాన్ని రూపొందించి ఔరా అనిపించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని నైలాన్ కలర్‌తో.. గుండు పిన్నుపై ఇమిడేలా గురు శిష్యుల రూపాన్ని ఆవిష్కరించారు. గురువు తన శిష్యున్ని ఆశీర్వదిస్తున్నట్లు... శిష్యుడు గురువు పాదాలు తాకి దీవెనలు తీసుకుంటున్న సన్నివేశం.. బడి చుట్టూ ప్రకృతి అందాలను తీర్చిదిద్దాడు.
సూక్ష కళాకారుడి ప్రతిభ... గుండు పిన్నుపై గురుశిష్యుల రూపకల్పన
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని జగిత్యాలకు చెందిన సూక్ష్మకళాకారుడు గుర్రం దయాకర్ ఆవిష్కరించిన కళాఖండం ఆకట్టుకుంటోంది. నైలాన్ కలర్‌తో.. గుండు పిన్నుపై ఇమిడేలా గురు శిష్యుల రూపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది... పలువురి అభినందనలు అందుకుంటున్నారు.
jagityal Micro artist made teachers day special Artwork
అతి చిన్న ఆకారంలోనే ఇంత గొప్ప కళాఖండాన్ని తీర్చిదిద్దటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తన కళతో అనేక సూక్ష్మ పరికరాలను తయారు చేసిన దయాకర్... తాజాగా చేసి అద్భుతమైన సూక్ష్మకళా రూపాన్ని తయారు చేయటంపై ఉపాధ్యాయ వర్గాలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.