తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో వెన్నలగండి పర్యాటకం

చుట్టూరా చెట్లు, ఎత్తైన కొండలు.. మధ్యలో జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతం ఎక్కడో కాదు జగిత్యాల జిల్లా వెన్నముద్దల గండిలో ఉంది. పర్యాటకులతో సందడిగా మారింది ఈ ప్రదేశం.

జగిత్యాల జిల్లాలో.. వెన్నలగండి పర్యాటకం

By

Published : Jul 29, 2019, 4:36 AM IST

Updated : Jul 29, 2019, 10:47 AM IST

జగిత్యాల జిల్లాలో వెన్నలగండి పర్యాటకం

జగిత్యాల జిల్లా రాయికల్‌, బీర్‌పూర్‌ మండలాల్లో కట్కాపూర్‌, రంగసాగర్‌ అను రెండు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల మధ్యలో ఎత్తైన కొండలు.. ఆ కొండల మధ్యలో జలపాతాలు ఉన్నట్లు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఎటు చూసినా పచ్చదనం.. ఎత్తైన కొండలు.. కొండల మధ్యలో సాగే జలపాతాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తరలి వస్తున్నారు. సెలవు రోజు వచ్చిందంటే చాలు భారీ సంఖ్యలో పర్యాటకులతో కళకళలాడుతోంది. ఈ ప్రాంతం ఊటిని తలపించేలా ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.

ఈ ప్రాంతాన్ని వెన్నముద్దల గండిగా పిలుస్తారు. వర్షాలు కురుస్తుండటం వల్ల పారే జలపాతాల్లో సేదతీరేందుకు ఇదోక మంచి ప్రదేశం. ఈ ప్రాంతంలో రాళ్లు వెన్నముద్దలను తలపించేలా తెల్లగా ఉండటం విశేషం. మహిళలు, పిల్లలు, యువత అందరికి ఇదొక విహార ప్రదేశంగా మారింది. నిత్యం ఉరుకుల పరుగులతో బిజీగా జీవితం గడుపుతున్న పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు. ఇదొక యాత్రా ప్రదేశంగా మారటం వల్ల ప్రత్యేక వాహనాల ద్వారా వచ్చి ఇక్కడికి ఉదయమే చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు ఉండి సరదాగా గడిపి వెళ్తున్నారు.

ఇదీ చూడండి : కిడ్నాపర్​ ఆచూకీ తెలిపిన వారికి లక్ష నజరానా

Last Updated : Jul 29, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details