జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణం 25 ఎకరాల్లో సాగుతోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ పనులు దాదాపు చివరి దశకు చేరాయి. సుమారు 100కుపైగా గదుల నిర్మాణంతోపాటు భారీ స్థాయి మీటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జేసీ కార్యాలయాలతోపాటు అన్ని శాఖల కార్యాలయాలు ఇక్కడ నుంచే సేవలు అందించనున్నాయి. ఇందులో ఏ, బీ, సీ, డీ బ్లాకులుగా విభజించారు.
శరవేగంగా సాగుతున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు - jagityal Collectorate building work
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది దసరా నాటికి కొత్త భవనాల నుంచే పరిపాలన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 25 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు దాదాపు 85 శాతం వరకు పూర్తయ్యాయి. నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు.
jagityal
గత నెల 29న జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. వారం క్రితం జేసీ క్యాంపు కార్యాలయం కూడా వినియోగంలోకి వచ్చింది. మిగతా కార్యాలయాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి దశకు చేరటం వల్ల వచ్చే విజయదశమికి.. అన్ని శాఖల కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగనున్నాయి.
ఇవీ చూడండి:భద్రాద్రిలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి