తెలంగాణ

telangana

ETV Bharat / state

పండగ పూట రైతులకు తప్పని ఇబ్బందులు - farmers

యూరియా కోసం పక్షం రోజులుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పండగ పూట యూరియా కోసం జగిత్యాల జిల్లా రైతులు రోడ్డెక్కారు.

యూరియా

By

Published : Sep 2, 2019, 1:12 PM IST

జనాలంతా వినాయక చవితి పండగ జరుపుకుంటూ.. ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుంటే... జగిత్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పక్షం రోజుల నుంచి యూరియా దొరక్క రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయికల్‌ మండలం ఉప్పుమడిగే సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు జగిత్యాల- రాయికల్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో అధికారులు విఫలమయ్యారని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించకపోతే దిగుబడులు రావని.. వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్​ చేశారు.

రైతులకు తప్పని ఇబ్బందులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details