లాటరీ పేరుతో ఓ అమాయకురాలిని నమ్మించి 15 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకున్న ఘటన జగిత్యాల పట్టణంలో వెలుగు చూసింది. జగిత్యాల అరవింద్‌నగర్‌లో ఉంటున్న సుతారి జమున అనే మహిళకు కొద్దిరోజుల క్రితం ఆగంతుకుడి నుంచి ఫోన్ వచ్చింది. మీరు నాలుగు కోట్లు గెలుచుకున్నారు. ఆ సొమ్ము మీకు రావాలంటే 15 లక్షల 40 వేలు మేం చెప్పిన ఖాతాలో వేయాలని నమ్మబలికారు. ఆగంతకుడి మాటలు నమ్మిన బాధితురాలు ముందుగా 25 వేలు ఆ తర్వాత 15 లక్షల 40 వేలు ఖాతాలో జమచేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావటం వల్ల మోసపోయానని గ్రహించిన మహిళ జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పొగొట్టుకొని... ఆమె లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి ఆగంతుకుల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లాటరీ పేరుతో జగిత్యాలలో భారీ మోసం - లాటరీ పేరుతో జగిత్యాలలో భారీ మోసం
మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు... అని మీ ఫోన్కు సందేశాలు వస్తుంటాయి. నమ్మారంటే ఇక అంతే సంగతులు!. ఇలాంటి ఘటన జగిత్యాలలో జరిగింది. ఓ అమాయకురాలిని నమ్మించి 15 లక్షల 40 వేలు కొట్టేశాడు ఓ ఆగంతుకుడు.
లాటరీ పేరుతో జగిత్యాలలో భారీ మోసం