తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో ఓట్ల కోసం కోళ్ల పంపిణీ - HEN DISTRIBUTION BY TRS

ఎన్నికల వేళ పార్టీ నాయకులు ఓట్ల కోసం కొత్త దారులు తొక్కుతున్నారు. జగిత్యాల జిల్లా రాయపట్నంలో తమ పార్టీకి ఓట్లేయమని తెరాస నేతలు కోళ్లు పంపిణీ చేయమన్నారని ఆటో డ్రైవర్​ దుబ్బయ్య తెలిపాడు.

ఆటోలో ఇంటింటికీ కోళ్లను తరలిస్తూ పట్టుబడ్డ దుబ్బయ్య

By

Published : Apr 11, 2019, 12:11 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలో ఓట్ల కోసం కోళ్లను పంపిణీ చేస్తుండగా స్థానిక భాజపా నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో కోళ్లను తరలిస్తూ ఇంటింటికీ పంచుతున్న అంతడ్పుల దుబ్బయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. తెరాస నాయకులు పంపిణీ చేయమన్నందునే.. కోళ్లను పంపిణీ చేస్తున్నానని దుబ్బయ్య తెలిపాడు.

తెరాస నేతలే కోళ్లు పంపిణీ చేయమన్నారు : ఆటో డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details