భారీ వర్షాలకు రోడ్లు జలమయం - heavy-rain-in-jagityala
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ధర్మపురి పట్టణంలోని పలు వీధులు జలమయమయ్యాయి.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు జలమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మపురిలోని వ్యవసాయ, అటవీ శాఖ కార్యాలయాల ముందు మోకాళ్ళ వరకు నీళ్లు నిలిచాయి. విధులకు వెళ్లాల్సిన సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మపురి, బుద్దేశపల్లి, నాగారం, కమలాపూర్, నర్సయ్యపల్లె, తుమ్మెనాల గ్రామ రైతులకు వరప్రదాయినిలాంటి అక్కపల్లి చెరువులోకి భారీగా వరద నీరు చేరి మత్తడి పోస్తోంది. వరదకు వస్తున్న చేపలు పట్టేందుకు పలువురు పోటీపడ్డారు.