తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో బియ్యం, కూరగాయల పంపిణీ - GROCERIES AND VEGETABLES DISTRIBUTION IN JAGITYAL DISTRICT BY MLC JEEVAN REDDY

జగిత్యాల జిల్లాలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న కూలీలకు, పేదలకు కూరగాయలు సహా బియ్యం పంపిణీ చేశారు. ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే సరకులు అందిస్తున్నామని దాతలు తెలిపారు.

పేదలకు కూరగాయలు, సరకులు అందజేత
పేదలకు కూరగాయలు, సరకులు అందజేత

By

Published : Apr 13, 2020, 2:05 PM IST

కరోనా లాక్ డౌన్ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్యక్రమానికి హాజరై సరకులు అందించారు. పోరండ్ల సర్పంచ్ సంధ్యారాణి, మరికొంత మంది దాతలు సాయంతో నిత్యావసరాలు అందజేశారు. సుమారు 10 క్వింటాళ్ల బియ్యం, మూడున్నర క్వింటాళ్ల బెండకాయలు, 2 క్వింటాళ్ల మిర్చి , 2 క్వింటాళ్ల ఉల్లి గడ్డలు, రెండు క్వింటాళ్ల టమాటాలను పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details