జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పాలనాధికారి రవితో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంభించారు. వీటి వల్ల గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం లభిస్తాయని ఆయన అన్నారు.
పల్లె ప్రకృతి వనాలతో ఆరోగ్యం, ఆహ్లాదం : ఎమ్మెల్యే - jagtial updates
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ఆరోగ్యం, ఆహ్లాదం అందిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పాలనాధికారి రవితో కలిసి ఆయన ప్రారంభించారు.
పల్లె ప్రకృతి వనాలతో ఆరోగ్యం, ఆహ్లాదం : ఎమ్మెల్యే
ప్రకృతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరిసరాలన్నీ కలియతిరిగి గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ వనాలతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు ప్రశాంత వాతావరణం లభిస్తుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.