తెలంగాణ

telangana

ETV Bharat / state

కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు - CHILD HARRASMENT

వరసకు తాత.. ఆ చిన్నారికి తెలియదు వాడిలో ఓ కామాంధుడు దాగి ఉన్నాడని. తాతే కదా అని దగ్గరకు వెళ్లింది. ఆ వ్యక్తి మనవరాలని తెలిసి కూడా లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. జగిత్యాలలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోంది.

కామాంధుడు... మనవరాలిని వదలలేదు

By

Published : Aug 18, 2019, 10:25 AM IST

Updated : Aug 18, 2019, 11:21 AM IST

వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన ఘోరాన్ని మరవకముందే జగిత్యాల జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై వరసకు తాత అయిన విశ్రాంత ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడడం వల్ల బాలిక గర్భం దాల్చింది. సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునేలా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే...

పదో తరగతి చదువుతున్న బాలిక గర్భవతిగా వెలుగు చూడటం జగిత్యాలలో సంచలనం కలిగించింది. పట్టణానికి చెందిన ఓ బాలిక జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమెపై వరసకు తాతైన 65 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు కన్నేశాడు. బాలికను లొంగదీసుకుని లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల తరచూ అస్వస్థతకు గురికావటం వల్ల కంగారుపడిన తల్లితండ్రులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించారు. నాలుగు నెలల గర్భవతిగా తేలడంతో హతాశులయ్యారు. అమ్మాయిని ఆరా తీయగా తాత అసలు రూపం బయటపడింది.

రివర్స్​ డ్రామా ప్లే చేసిన తాత

ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బంధువులు, కుటుంబ సభ్యులు సదరు వృద్ధుడిని పిలిచి విషయం అడిగారు. ఆ కామాంధుడు మాత్రం తనకు ఏమి తెలియదని బుకాయించాడు. పైగా తనకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇంటికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. శనివారం రాత్రి బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

కామాంధుడు... మనవరాలిని వదలలేదు

ఇదీ చూడండి:పురివిప్పి ఆడిన నెమళ్లు.. వర్షాలపై ప్రజల ఆశలు

Last Updated : Aug 18, 2019, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details