రాష్ట్ర యువతను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఒప్పంద ఉద్యోగులు లేకుండా అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ప్రజా సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా తెరాస ప్రలోబాలకు గురిచేస్తోందని ఆక్షేపించారు.
నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న అంశాల మీద ఆధారపడి ఏర్పడ్డ రాష్ట్రంలో యువతకు అన్యాయమే జరిగిందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల బరిలో ఉన్న ఆయన... తనను గెలిపించాలని కోరారు.
హామీలను మరిచారు...!