కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు - కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు
గోకులాష్టమి సందర్భంగా మెట్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో మహిళలు కోలాటాలాడారు. 108 రకాల ప్రసాదాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.
కోలాటాల నడుమ గోకులాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం మహిళా భక్తులు చేసిన కోలాటం, దాండియా ఆటలు ఆకట్టుకున్నాయి. రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులు నృత్యాలు చేశారు. స్వామివారికి 108 ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు.