తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించాడు.. సహజీవనం చేశాడు.. కానీ..!

నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి సహజీవనం చేశారు. తీరా పెళ్లి ఊసు ఎత్తేసరికి యువకుడు ముఖం చాటేశాడు. చేసేది లేక యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Girlfriend protest in front of boyfriend's house in jagtial district
ప్రేమించాడు.. సహజీవనం చేశాడు.. కానీ..!

By

Published : Jul 25, 2020, 9:28 AM IST

కరీంనగర్‌ జిల్లా రేకుర్తికి చెందిన శ్రీవాణి అనే యువతి కరీంనగర్​లోని ఓ కార్యాలయంలో పనిచేస్తోన్న సమయంలో జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన అన్వేశ్​తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్లుగా ఇద్దరూ సహజీవనం సాగించారు. ఈ క్రమంలోనే శ్రీవాణి తనను పెళ్లిచేసుకోవాలంటూ అన్వేశ్​పై ఒత్తిడి తేవడంతో అన్వేశ్​ నిరాకరించాడు.

ఫలితంగా శ్రీవాణి మల్యాలలోని తన ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుంది. సదరు యువతిని యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ కొందరు మహిళలు యువతికి అండగా నిలిచారు. యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లడం వల్ల రాత్రి వరకు యువతి అక్కడే బైఠాయించింది.

ఇదీచూడండి: 'భూ సమస్యలు పరిష్కరిస్తా.. పాసుపుస్తకాలు పంచుతా'

ABOUT THE AUTHOR

...view details