తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో 144 సెక్షన్ విధింపు

రైతులు శుక్రవారం మహాధర్నా తలపెట్టిన నేపథ్యంలో జగిత్యాలలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు నాయకులు జిల్లా కేంద్రానికి రావొద్దంటూ నోటీసులు జారీ చేశారు. పలు గ్రామాల్లో రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

farmers arrested in jagityala district
జగిత్యాలలో 144 సెక్షన్ విధింపు

By

Published : Oct 23, 2020, 6:28 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయి. మక్కలకు మద్దతు ధర, సన్నరకం వరికి రూ.2500 ఇవ్వాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతులు శుక్రవారం మహాధర్నా తలపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు నాయకులు జిల్లా కేంద్రానికి రావద్దంటూ నోటీసులు జారీ చేశారు. పలు గ్రామాల్లో రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గత వారం జరిగిన మెట్​పల్లి ర్యాలీ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి యత్నించిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పొరుగు జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్​లో అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details