విజయవాడలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ నిరుపేద మహిళ కుటుంబానికి ఫేస్బుక్ మిత్రులు చేయూతనందించారు. రుడావతి మహేశ్వరికి తల్లిదండ్రులతో పాటు భర్త కొన్నేళ్ల క్రితం మరణించించాడు. దీనికి తోడు మహేశ్వరి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది.
నిరుపేద మహిళకు చేయూతనిచ్చిన ఫేస్బుక్ మిత్రులు
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ సామాజిక సేవకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు... ఓ నిరుపేద మహిళకు చేయూతనిచ్చింది. తల్లిదండ్రులు, భర్త లేని ఆ మహిళకు తామున్నామంటూ ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచారు. తన దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స కోసం తలా కొంచెం సాయం చేశారు.
face book friends helped to a vijayawada women
అత్యంత దీనస్థితిలో తన చెల్లిలితో కలసి నివాసముంటున్న మహేశ్వరి పరిస్థితిని పలువురు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన రమేశ్... మహేశ్వరి పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. బాధితురాలి దీనస్థితిని చూసి చలించిన ఫేస్బుక్ మిత్రులు... చికిత్స కోసం ఆమె ఖాతాలో రూ.1.29 లక్షలు జమ చేశారు.