జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మెట్పల్లి ఎక్సైజ్ అధికారులకు అందించారు. ఆరు బీర్ కేసులతో పాటు లిక్కర్ బాటిళ్లను ఆటోలో తరలిస్తున్న సమయంలో కోరుట్లలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆటోను ఆపి పరిశీలించారు. అందులో మద్యం బాటిళ్లును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
మద్యం స్వాధీనం చేసుకున్న ఎలక్షన్ స్క్వాడ్ - అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లో జరిగింది. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అందించారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత