లోక్సభ ఎన్నికల వేళ గ్రామాలు కళాకారుల ఆటపాటలతో సందడిగా మారాయి. కాళ్లకు గజ్జెకట్టి వేదికపై అభ్యర్థుల తరఫున ఆడిపాడుతున్నారు కళామాతల్లి ముద్దు బిడ్డలు. నాయకులు రావడానికి ముందు జనాలను తమ ఆటపాటలతో మైమరిపిస్తారు. నాయకుల చేరవేయలేని మాటలను కళాకారులు తమ పాట రూపంలో వివరిస్తూ ఉపాధి పొందుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు నేతల తలరాతలు మార్చుతుంటే కళాకారులకు మాత్రం మంచి ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి.
ఎన్నికల వేళ కళాకారుల ముఖాల్లో కొత్తకళ - work
ఎన్నికలు వచ్చాయంటే చాలు వారికి ఉపాధి దొరుకుతుంది. చేతి నిండ పని ఉంటుంది. రాజకీయ నాయకులు మాటలు చెబుతుంటే వారు తమ పాటలతో అలరిస్తారు. అభ్యర్థులకు పాటల రూపంలో ప్రచారం చేస్తూ గెలుపునకు కృషి చేస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కళాకారులు.
నిన్న మొన్నటి వరకు ఏ పనిలేక ఇబ్బంది పడ్డ కళాకారులకు ఈ ఎన్నికలు చేతి నిండా పని కల్పించాయి. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీల శైలిని అనుసరిస్తూ పోటీలో ఉండే నాయకుడికి ఒత్తిడి లేకుండా చేస్తున్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. భోజన సౌకర్యం కూడా పార్టీలదే.
తమ ప్రతిభను చాటుకోవడానికి ఎన్నికల ప్రచారం ఒక వేదికగా ఉపయోగపడుతుందని కళాకారులు అంటున్నారు. తమ ఆటపాటలతో జనహృదయాలను గెలుచుకోవడం సంతృప్తిని ఇస్తుందంటున్నారు. నేటితో ప్రచారం ముగియనుంది. ఇన్ని రోజులు సంబరం ఇవాళ్టితో ముగుస్తుంది. రేపటి నుంచి తమ కళను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తు ఉండాలి. ఇవీ చూడండిశాంతి భద్రతలకై నిర్బంధ తనిఖీలు