తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాస్టిక్ వస్తువులు వాడొద్దని ప్రజలచే కలెక్టర్ రాజేశం ప్రతిజ్ఞ చేయించారు.

By

Published : Oct 2, 2019, 3:21 PM IST

ప్లాస్టిక్ నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన

ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జగిత్యాల మండలం లక్ష్మీపూర్​లో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ ను వాడొబోమని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామవీధుల్లో బతుకమ్మలతో మహిళలు ర్యాలీ నిర్వహించి వీధుల్లో బతుకమ్మ ఆడారు. పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్​ను లక్ష్మీపూర్ నుంచి పారద్రోలి ఆదర్శంగా నిలవాలని గ్రామస్థులకు జేసీ రాజేశం సూచించారు. అంతకుముందు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు.

ప్లాస్టిక్ నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన

ABOUT THE AUTHOR

...view details