జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టారు. తమ కళాశాలలో కామర్స్ కోర్సులను కోరుట్ల డిగ్రీ కళాశాలకు తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సర్కారు కళాశాలను నమ్ముకొని పేద విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారన్నారు. కోర్సులను ఇతర కళాశాలకు తరలించటం వల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి... జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
కోర్సులు తరలించటంపై డిగ్రీ విద్యార్థుల దీక్షలు - మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన
కోర్సులను వేరే కళాశాలకు తరలించటంపై జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ.. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
DEGREE STUDENTS STRIKE AT METPALLY FOR TRANSFORM OF THEIR COURSES