జగిత్యాల జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబ సభ్యులను పరీక్షించగా కొవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు కలెక్టర్ రవి ప్రకటించారు. కోరుట్లలో రెండు, జగిత్యాల మండలంలోని ఐదేళ్ల బాలుడితో సహా మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులకు చెందిన 8 మందిని వరంగల్ కరోనా పరీక్ష కేంద్రానికి తరలించారు.
ఆ 8 మందికి నెగిటివ్... మరోసారి పరీక్షించి పంపిస్తాం: కలెక్టర్ - VICTIMS RELATIVES IN JAGITYAL DISTRICT
జగిత్యాల జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకిన బాధిత కుటుంబీకులను పరీక్ష చేయగా నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు కలెక్టర్ రవి తెలిపారు. మరికొన్ని రోజులు కూడా వీరిని క్వారంటైన్ హోమ్‌లో ఉంచి మరోసారి పరీక్షించి నెగిటివ్ వస్తే పంపించేస్తామని కలెక్టర్ తెలిపారు.
'మరోసారి నిర్వహించే పరీక్షలో నెగిటివ్ వస్తే పంపిచేస్తాం'
ఫలితాల్లో నెగటివ్ రావటం వల్ల జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం వీరందరూ క్వారంటైన్ హోమ్‌లోనే ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు క్వారంటైన్ హోమ్‌లోనే ఉండనున్నారు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉంచి మరోసారి పరీక్ష అనంతరం నెగిటివ్ వస్తేనే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
Last Updated : Apr 23, 2020, 4:25 PM IST