జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఎస్‌బీఐ వ్యవసాయ అభివృద్ధి శాఖలోని ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో... ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పురపాలక అధికారులు వెంటనే స్పందించి బ్యాంకు లోపల, బయట హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. కొవిడ్ కేసుల ప్రభావంతో బ్యాంకును అధికారులు మూసివేశారు.
మెట్‌పల్లిలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు
జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తోన్నాయి. మెట్‌పల్లిలో కరోనా కేసులు లేక గత మూడు నెలల నుంచి ప్రజలందరూ ఊపిరిపీల్చుకున్న సమయంలో... ఒక్కసారిగా కేసులు ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమైయ్యారు.
మెట్‌పల్లిలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు
కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీ చదవండి:మీ పిల్లలకు కాస్త బుజ్జగించి చెప్పండిలా...