పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టింది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇందిరాభవన్ నుంచి కొత్తబస్టాండ్ వరకు ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో... ఉద్రిక్తత నెలకొంది.
'తోపులాటలో కిందపడ్డ జీవన్‌రెడ్డి.. బలవంతంగా స్టేషన్‌కు తరలింపు' - mlc jeevan reddy latest news
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ... ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా.. కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
'తోపులాటలో కిందపడ్డ జీవన్‌రెడ్డి.. బలవంతంగా స్టేషన్‌కు తరలింపు'
పోలీసులు జీవన్‌రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలను అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో జీవన్‌రెడ్డి కింద పడిపోగా.. బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి:సీఎం చేతుల మీదుగా 'సుంకిశాల' పనులకు ఈనెలలోనే శ్రీకారం!
Last Updated : Jun 11, 2021, 2:26 PM IST