ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ..జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. తహసీల్దార్ చౌరస్తా వద్ద ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరినా సంస్థకు ఎలా మూల్యాంకణ బాధ్యతలు అప్పజెప్పారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.
జగిత్యాలలో కాంగ్రెస్ ఆందోళన
పీసీసీ పిలుపు మేరకు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు అధికారుల వైఫల్యమే కారణమంటూ మండిపడ్డారు ఆపార్టీ నాయకులు.
కేసీఆర్ తన లోపాలను దాచేందుకే ప్రయత్నిస్తున్నాడు: జీవన్ రెడ్డి
రెవెన్యూ శాఖ, ఇంటర్ బోర్డులో పొరపాట్లు జరిగాయని ఆ శాఖలను ఎత్తివేయాలని కేసీఆర్ అంటున్నారు. అసలు ఎత్తివేయాల్సింది ఈ తెరాస ప్రభుత్వాన్నే. కేసీఆర్ తన లోపాలను కప్పి పుచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నాడు.
------ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఇవీ చూడండి : అంతర్గత విచారణ కమిటీకి జస్టిస్ రమణ దూరం