మహబూబాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని అన్నారు.
'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు' - Congress MLC Jeevan reedy Municipal Election Campaign in Jagityala district
మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకే ఓటు వేయాలని ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు.
'మంత్రి ఎర్రబెల్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'
రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం