లాక్‌డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో జీవన్‌రెడ్డి నివాసం నుంచి ర్యాలీగా బయలు దేరి ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్‌కు వినతి పత్రం అందజేశారు.
విద్యుత్ బిల్లుల రద్దుకై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా - latest news of jagityala
అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్‌కు వినతి పత్రం అందజేశారు.
విద్యుత్ బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా
ప్రభుత్వం పేద ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతుందని.. వెంటనే బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.
ఇదీ చూడండి:-నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు