జగిత్యాల జిల్లా కల్లెడలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఊరు చల్లగా ఉండాలని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు దేవతకు మొక్కులు చెల్లించారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
కల్లెడలో బోనాల పండగ - kalleda
ఆషాడమాసం రావడం వల్ల పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామస్థులు పోచమ్మకు బోనాలు సమర్పించారు.
బోనాలు తీసుకెళ్తున్న మహిళలు