తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో అర్ధరాత్రి భాజపా కార్యకర్తల ఆందోళన - జగిత్యాల జిల్లా వార్తలు

జగిత్యాలలో అర్ధరాత్రి భాజపా, వీహెచ్​పీ నాయకులు ఆందోళనకు దిగారు. విజయదశమి రోజు శమీపూజ జరిగే జమ్మిగద్దెకు గులాబి రంగు వేయటం వల్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

BJP leaders dharna in jagityal at midnight for rose colour issue in dasara
జగిత్యాలలో అర్ధరాత్రి భాజపా కార్యకర్తల ఆందోళన

By

Published : Oct 25, 2020, 6:04 AM IST

Updated : Oct 25, 2020, 7:24 AM IST

జగిత్యాలలో ఏటా విజయదశమి రోజు శమీపూజ జరిగే జమ్మిగద్దెకు గులాబి రంగు వేయటాన్ని భాజపా, వీహెచ్​పీ నాయకులు వ్యతిరేకించారు. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీ రంగును వెంటనే తొలగించాలని వారు నిరసన వ్యక్తం చేశారు.

నాయకుల ఆందోళనతో పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, పురపాలిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మిగద్దెకు వేసిన గులాబిరంగును వెంటనే తొలగిస్తామని పురపాలిక అధికారులు హామీ ఇవ్వడం వల్ల ధర్నా విరమించారు. పవిత్ర విజయదశమికి చిహ్నంగా నిలిచే శమీపూజ వేదికకు గులాబీరంగు వేయటాన్ని భాజపా, వీహెచ్​పీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇదీ చూడండి:వేములవాడలో ఘనంగా అమ్మవారికి తెప్పోత్సవం

Last Updated : Oct 25, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details