వైభవంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - batukamma celebrations
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని చావిడి ప్రాంతంలోనున్న ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
బతుకమ్మ సంబురాలు ప్రభుత్వ పాఠశాలల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నూతన ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఇంటి దగ్గరనుంచి వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తయారుచేశారు. కొందరు బతుకమ్మ పాటలు పాడుతూ మరికొందరూ నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. విద్యార్థులు తలపై బతుకమ్మలను ఎత్తుకుని వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళ్లి.. చెన్నకేశవుని ఆలయ కోనేటిలో వాటిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
TAGGED:
batukamma celebrations