అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసుంటారు.. మరెన్నో రకాల వస్తువులను చూసుంటారు. కానీ అదే అగ్గిపెట్టెలో ఇమిడే వెదురు కళాకృతులను బహుశా చుసుండకపోవచ్చు. చిన్న అగ్గిపెట్టెలో పట్టెంత వెదురు కళాకృతులను బుట్టలు, చాటా తయారు చేస్తున్నారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య. అగ్గిపెట్టెలో ఇమిడే వెదురు కళాకృతులు చేసి ఔరా అనిపిస్తున్నారు. ఈయన గతంలోనూ వెదురుతో పలు వస్తువులను తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. వెదురు కళాకృతులను చూసేందుకు.. స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
అగ్గిపెట్టెలో ఇమిడే వెదురు కళాకృతులు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
అందమైన వస్తువులు.. ఆకట్టుకునే సామగ్రి. బుట్టల నుంచి చాటా వరకు.. అన్ని వెదురుతోనే. అడవిలో దొరికే వెదురుతో అద్భుతమైన కళాకృతులను సృష్టిస్తూ.. భళా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా వాసి. వెదురుతో ప్రయోగాలు చేస్తూ అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా కళాకృతులను రూపొందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
వెదురు