బక్రీద్ పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు మాస్కులు ధరించి, సామూహిక దూరం పాటించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మత గురువు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో కొంతమంది ప్రార్థనల్లో పాల్గొనగా.. జగిత్యాల ఖిల్లా వద్ద మత గురువు అబ్రార్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపారు. వీటితో పాటు పట్టణంలోని 24 మసీదుల్లో బక్రీద్ ప్రార్థనలు జరిగాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బక్రీద్ ప్రార్థనలు - జగిత్యాల జిల్లా వార్తలు
బక్రీద్ పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగా హాజరైన ముస్లింలు మాస్కులు ధరించి ప్రార్థనలు జరిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బక్రీద్ ప్రార్థనలు