తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో టీకా పంపిణీ ఏర్పాట్లు - జగిత్యాలలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కరోనా టీకా పంపిణీకి రంగం సిద్దమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 420మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలివిడతలో కేవలం ఆరోగ్య సిబ్బందికే టీకా ఇవ్వటం పట్ల ప్రతికూల ప్రతిస్పందన ఉన్నా... తగిన వైద్యసేవలు అందించేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు.

arrangments complete for vaccine distribution in jagitialdistrict
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో టీకా పంపిణీ ఏర్పాట్లు

By

Published : Jan 16, 2021, 2:45 AM IST

వ్యాక్సిన్‌ ప్రోటోకాల్ ప్రకారం ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలను సిద్దం చేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు టీకా పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభిస్తే దానికి అనుగుణంగా ఆయా కేంద్రాల్లోను మొదలు పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టీకా తీసుకొనే వారికి సమాచారం చేరవేసామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు 404 వాయిల్స్ ఇప్పటికే చేరుకోగా... వీటి ద్వారా మొత్తం 3,040 మందికి టీకా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీకాతో ఎలాంటి పరిణామాలైన ఎదురైతే వారికి అన్నిరకాల వైద్యసేవలు అందించే విధంగా ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాదికారి డాక్టర్ సుజాత తెలిపారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీకా కేంద్రాల ఏర్పాటులోను కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో రెండు ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రితో పాటు బుట్టిరాజారాం కాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో టీకా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో తిమ్మాపూర్‌, హుజూరాబాద్‌లోను టీకా పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అతితక్కువగా పెద్దపల్లి జిల్లాలో 380డోసులకు గానూ 38వాయిల్స్ కేటాయించారు. జగిత్యాల జిల్లాలో జగిత్యాలతోపాటు కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలోను టీకా పంపిణీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లతో పాటు ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయనున్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు..

ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details