తెలంగాణ

telangana

ETV Bharat / state

జూపార్కులు, టైగర్​ రిజర్వులు మూసివేత - telangana varthalu

కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్​లోని కాకతీయ జూ పార్క్​లను మూసివేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ వెల్లడించారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

zoo parks closed due to corona
కరోనాపై పోరు: జూపార్కులు, టైగర్​ రిజర్వులు మూసివేత

By

Published : May 1, 2021, 5:40 PM IST

Updated : May 1, 2021, 7:51 PM IST

కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూపార్కులు, పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

మంత్రి సూచనల మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూపార్కులను రేపటి నుంచి మూసివేస్తున్నామన్నారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు, రక్షిత అటవీ ప్రాంతాలు మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. వీటిలో సందర్శకులకు అనుమతి నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్​లోని కేబీఆర్ పార్కును కూడా కొవిడ్​ నిబంధనల ప్రకారం మూసివేయనున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'

Last Updated : May 1, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details