YS Sharmila Joins in Congress :ఒక జాతీయ పార్టీతో.. ఒక ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడం.. ఒక జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ విలీనం కావడం గతంలో చూశాం. ఇప్పుడూ ఈ తరహా రాజకీయాలు చూస్తున్నాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పార్టీ నేతలు మరొక పార్టీలో చేరడం సర్వసాధారణంగా మారిపోయింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల నివాసాలకు వెళ్లి.. కాంగ్రెస్‌లోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టీపీ కూడా హస్తంకు చేరువవ్వాలని చూస్తుంది.
- Ponguleti about joining in Congress : 'ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.. మరో రెండు రోజుల్లో నిర్ణయం'
YSRTP to Merge With Congress :వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. 15 రోజులుగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు.. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో.. వైఎస్‌ఆర్‌టీపీ ముఖ్యనేత దేవేందర్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతోనూ.. ఆ పార్టీ ముఖ్యులు చర్చించినట్లు తెలుస్తోంది.
- YS Sharmila Meest DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
పొత్తు అంశంపై చర్చలు : కర్ణాటక ఎన్నికల అనంతరంషర్మిల.. కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. ఆ సమయంలో పొత్తు అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. అప్పుడు వైఎస్‌ఆర్‌టీపీని.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. షర్మిల ఖండించడంతో.. ఆ ప్రచారం ఆగిపోయింది. నాలుగు రోజుల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను.. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు కలిసి... కలిసి చర్చించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఈ అంశంపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు సమాచారం.