ఏపీలో వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. రూ.510 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోపు పంట రుణాలను చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 2019 ఖరీఫ్ రుణాలకు సంబంధించి పంట రుణాలకు సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేశారు.
వైఎస్ఆర్ సున్నావడ్డీ.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు - వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం
సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే.. మొత్తం వడ్డీ తిరిగి వస్తుందని.. రైతులకు భరోసా కలుగుతుందని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల ఫథకాన్ని ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం మాటమీద నిలబడుతుందని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు
గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న వడ్డీలేని రుణాల బకాయిలను విడుదల చేశారు. 2014-2019 వరకు ఉన్న రూ.1180 కోట్ల బకాయిలు రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనుంది. 1.66 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.132 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని సీఎం జగన్ తెలిపారు.
ఇదీ చదవండి:'వరద' బారులు: మీసేవా కేంద్రాల్లో గంటలకొద్దీ బాధితులు