ఏపీ స్వయం సహాయక బృందాలకు ఆర్థికసాయమందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్నిఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించిన ఈ పథకం ద్వారా... 90 లక్షల 37 వేల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. వారి ఖాతాల్లోకి రూ. 1,400 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.
ఏపీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయ బృందాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ద్వారా 90 లక్షలకుపైగా మహిళల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు జమ కానున్నాయి. 8.78 లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో ఒకేసారి వడ్డీ సొమ్ము జమ కానుంది.
ఏపీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
8 లక్షల 78 వేల పొదుపు సంఘాల ఖాతాల్లో ఒకేసారి వడ్డీ సొమ్ము జమ కానుంది. సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే సహాయక సంఘాల ఖాతాల్లో నగదు వేయనున్నారు.
ఇదీ చూడండి:సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు