ఏపీలో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారూ ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. అన్ని రకాల బియ్యం కార్డు కలిగినవారిని అర్హులుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్‌ఆర్ పింఛను కార్డు, జగనన్న విద్య, వసతి దీవెన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది.
వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తింపు - ysr aarogyasri scheme latest news
ఏపీలో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణి లేదా 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి ఉన్న భూయజమానులను అర్హులుగా ప్రకటించింది. మాగాణి, మెట్ట భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరినీ అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. 5 లక్షల వార్షికాదాయానికి పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు..... ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ గౌరవ వేతనం అందుకుంటున్న ఉద్యోగులు అర్హులుగా మార్గదర్శకాల్లో పేర్కొంది. కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు.
ఇవీ చూడండి:కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లులు రూ. 273.63 కోట్లు