తెలంగాణ

telangana

ETV Bharat / state

YS SHARMILA: "ద‌ళిత భేరి" సభకు మందకృష్ణ మాదిగను ఆహ్వానించిన షర్మిల - మంద కృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకుని... ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని వై.ఎస్​.షర్మిల ఆకాంక్షించారు. ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న మందకృష్ణను షర్మిల పరామర్శించారు. సూర్యాపేటలో జరిగే దళిత భేరి బహిరంగ సభకు హాజరుకావాలని కోరారు.

YS SHARMILA
మందకృష్ణ మాదిగను పరామర్శించిన షర్మిల

By

Published : Sep 8, 2021, 2:15 PM IST

వైఎస్సాఆర్‌ టీపీ అధినాయ‌కురాలు వై.ఎస్ ష‌ర్మిల హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను పరామర్శించారు. ఇటీవల కాలుజారిపడి గాయాలైన మందకృష్ణకు... దిల్లీలో శస్త్రచికిత్స జరగింది. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి... ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని... తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.

అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12న సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి పట్టణంలో వైఎస్సాఆర్‌ టీపీ నిర్వహించే "ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ‌కు మందకృష్ణను ఆహ్వానించారు. ద‌ళితుల ప‌క్షాన తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని షర్మిల కోరారు.

శస్త్ర చికిత్స ఎందుకంటే..

ఎస్సీ వర్గీకరణ విషయం చర్చించడం కోసం మందకృష్ణమాదిగ దిల్లీకి వెళ్లారు. అక్కడ వారున్న నివాసంలో ఆయన కాలు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడి కాలు ఎముక ఫ్యాక్చర్​ అయింది. వెంటనే ఆస్పత్రిలో చేరగా... శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం మందకృష్ణ హైదరాబాద్​కు వచ్చారు.

ఇదీ చూడండి:Kishan Reddy: మందకృష్ణను పరామర్శించిన కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details