YS Sharmila health condition: పాదయాత్ర అనుమతి కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వివేకనందా రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, సీనియర్ వైద్యులు డా.ప్రవీణ్ కుమార్‌తో కూడిన వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సునీతారెడ్డి ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిందని పేర్కొన్నారు.
క్షీణించిన షర్మిల ఆరోగ్యం.. తక్షణమే ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ల సూచన - తెలంగాణ తాజా వార్తలు
YS Sharmila health condition: పాదయాత్ర అనుమతి కోసం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరహార దీక్ష రెండో రోజూ కొనసాగుతుండగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డితో కూడిన వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిల బీపీ లెవెల్స్ పడిపోయాయని ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
YS Sharmila health condition
ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో బ్లడ్ లాక్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష సమయంలో ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలిపారు. వీటి ప్రభావంతో రాబోయే రోజుల్లో కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. తక్షణమే షర్మిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆమె వివరించారు.
ఇవీ చదవండి: