YS Sharmila comments on CM KCR Maharashtra tour : ట్విటర్ వేదికగా వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ తిరిగే టీఎస్ఆర్టీసీ బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ వాహనాలతో మహారాష్ట్రలో ఎలా తిరుగుతారని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్రలో మంత్రులు తిరిగే వాహనాలు తెలంగాణ ఆస్తులని.. రాష్ట్ర ప్రజల కష్టార్జితమని గుర్తు చేశారు.
ప్రజల పన్నుల మీద కొనుగోలు చేసే వాహనాలను ఏ నైతికతతో ఆ రాష్ట్రంలో నడుపుతారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షన్నర కోట్ల కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇసుక, గనులు, గ్రానైటు, భూములు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను బందిపోటు రాక్షస సమితి నేతలుగా వైఎస్ షర్మిలపోల్చారు. చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
- CM KCR Maharashtra Tour : 600 కార్లతో భారీ కాన్వాయ్‌గా మహారాష్ట్రకు సీఎం కేసీఆర్
- YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్ఆర్టీపీ విలీనం కానుందా?
YS Sharmila latest comments : ఇప్పుడు బీఆర్ఎస్ నేతల గొప్పల కోసం రాష్ట్ర ఆస్తులను పక్క రాష్ట్రంలో వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు నీతి ఉంటే తెలంగాణ వాహనాలను సరిహద్దులో వదిలి.. మహారాష్ట్ర వాహనాలల్లో తిరగాలని హితవు పలికారు. కేసీఆర్ రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఆటలు కట్టించడానికి ప్రజలు ఓటుతో సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.