తెలంగాణ

telangana

ETV Bharat / state

'యువత వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి' - హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

'యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి'

By

Published : Nov 3, 2019, 6:38 PM IST

'యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి'

హైదరాబాద్ సరూర్​నగర్​లోని హుడా కాలనీలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్​ హోదాలో తాను ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు. వేదికపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ​ సభ్యులు కొండా విశ్వేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details