పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం సుబ్బరాయపురంలో మద్యం తాగవద్దని తండ్రి మందలించగా మనస్తాపం చెందిన యువకుడు పోలవరం కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గల్లంతైన యువకుని కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం వేగంగా ఉండటం వల్ల కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
తండ్రి తాగొద్దన్నాడని.. యువకుడి ఆత్మహత్య! - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు
మద్యం తాగవద్దని తండ్రి మందలించటంతో యువకుడు కాలువలో దూకిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సుబ్బరాయపురంలో జరిగింది. కాలువలో గల్లంతైన యువకుని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
తండ్రి తాగొద్దన్నాడని.. యువకుడి ఆత్మహత్య!