- మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొవిడ్ మహమ్మారి ఉంది. బహిరంగ విచారణలు జరుగుతున్నాయా?
నేను 2020 ఏప్రిల్‌లో ఛైర్మన్‌గా బాద్యతలు చేపట్టాను. కొవిడ్ ఉదృత్ధంగా ఉన్న రోజులవి.. కోర్టులే పూర్థి స్తాయిలో పనిచేయ లేదు. ఇంకా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా విచారిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సీజీఆర్‌ఎఫ్-2 ప్రతినెల బహిరంగ విచారణలు నిర్వహించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించింది. 33 ప్రాంతాల్లో బహిరంగ విచారణలు చేపట్టాం. ప్రతి నెలా ముందే పర్యటన షెడ్యూల్ ప్రకటించి.. ఆయా విద్యుత్తు సెక్షన్ల పరిధిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. కాగితంపై రాసిచ్చినా ఫిర్యాదు తీసుకుంటాం. కార్యాలయ చిరునామాకు పోస్టులో, ఫాక్స్‌లో, ఈ మెయిల్‌లోనూ ఫిర్యాదు పంపవచ్ఛు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు.
- పది నెలల వ్యవధిలో ఎన్ని ఫిర్యాదులు అందాయి? వాటి ప్రస్తుత స్థితి?
ఏప్రిల్ నుంచి 129 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 120 కేసుల్లో ఆర్డర్లు పాస్ చేశాం. మిగిలినవి విచారణలో ఉన్నాయి. 2003 విద్యుత్తు చట్టం, ఈఆర్‌సీ మార్గదర్శకాల మేరకు విచారించి సాధ్యమైనంత వరకు వినియోగదారులకు న్యాయం చేస్తున్నాం. 73 కేసుల్లో వినియోగదారులకు అనుకూలంగానే ఆర్డర్లు ఇచ్చాం. సాధారణంగా ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పరిష్కారానికి 45 రోజుల గడువు ఉంటుంది. అంత సమయం తీసుకోకుండా ఎప్పటివప్పుడే విచారిస్తున్నాం.
- సీజీఎఫ్‌ఆర్‌ఎఫ్ ఆదేశాలు అమలు చేయకపోతే సిబ్బందిపై జరిమానాలు విధించొచ్చు అని చట్టంలో ఉంది. ఎంతమందికి జరిమానా వేశారు?
సీజీఆర్‌ఎఫ్ ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే వినియోగదారులు విద్యుత్తు అంబుడ్స్‌మన్‌కు అప్పీల్ చేయవచ్ఛు అక్కడ న్యాయం జరగలేదని అనిపిస్తే హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్ఛు టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులైతే నేరుగా హైకోర్టులో సవాల్ చేయవచ్ఛు ఆదేశాలను వారు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఒక కేసులో అధికారులపై రూ. 8250 జరిమానా వేసి కట్టించాం కూడా. వినియోగదారులకు కేసులను బట్టి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తుంటాం.
- ఈ వేదికపై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతున్నారా?