తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్ 15 నుంచి యోగా సప్తాహ్–2020 - Yoga Saptah -2020 start from june 15th

తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగా సాధన ప్రోత్సహిస్తే వారిలో ప్రతిభా పాఠవాలు, ఆరోగ్యం మెరుగవుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తద్వారా చదువులో వారి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని గవర్నర్ వివరించారు. యోగా సప్తాహ్–2020 కార్యక్రమాన్ని రాజ్​భవన్​ నుంచి ప్రారంభించారు.

Yoga Saptah -2020 from June 15th in telangana
జూన్ 15 నుంచి యోగా సప్తాహ్–2020

By

Published : Jun 14, 2020, 7:29 AM IST

ఎక్కువ కాలం జీవించడం కంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా నాణ్యమైన జీవనం గడపడం ముఖ్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యోగా సప్తాహ్–2020 కార్యక్రమాన్ని రాజ్​భవన్ నుంచి ఆన్​లైన్​లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విరాట్ భారత్ సంస్థ ఆన్​లైన్ యోగా సప్తాహ్ 2020 కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి 21 వరకు నిర్వహిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్​తో పాటు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఆర్​యస్​యస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

ఐదు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన యోగా ద్వారా సంపూర్ణ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సాధించవచ్చని తమిళిసై తెలిపారు. గైనకాలజిస్ట్ అయిన గవర్నర్ తన అనుభవాన్ని వివరిస్తూ అనేకమంది గర్భిణీ స్త్రీలు యోగా సాధన ద్వారా సిజేరియన్ సర్జరీలు అవసరం లేకుండా కాన్పులు అయ్యేవారని వివరించారు. యోగా కూడా ఒక డాక్టర్ లాగే ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆమె అన్నారు. ప్రధాని మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

జూన్ 15 నుంచి యోగా సప్తాహ్–2020

ఇదీ చూడండి :ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details