ఎల్బీనగర్ చిత్ర లేఅవుట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతానికి అనుగుణంగా యోగా చేస్తూ ఆకట్టుకున్నారు. చిన్నా, పెద్ద అంతా కలిసి ఆసనాలు వేశారు. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని... రుగ్మతలకు దూరంగా ఉంటారని యోగా నిపుణులు సూచించారు.
చక్కని వాతావరణంలో ఆధ్యాత్మిక యోగా - yoga day
రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా ఎల్బీనగర్లోని చిత్ర లేఅవుట్లో ఆసనాలు వేశారు.
యోగా దినోత్సవ వేడుకలు